మైండ్ దొబ్బింది ఓకే..జ్యూస్ సంగతి తేలాలి
ఎదుటివారిపై విమర్శలు చేయటమే కాదు..తనపై కూడా తాను విమర్శలు చేసుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అని చెప్పొచ్చు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ సంఘటన. నాగార్జున హీరో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ సోమవారం నాడు ప్రారంభం అయింది. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తరువాత తెలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు.
అన్నపూర్ణ స్టూడియో అంటే తనకు సెంటిమెంట్ అని, డిసెంబర్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు. 28 సంవత్సరాల క్రితం తెలుగు సినీ చరిత్రలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన 'శివ' కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. 'శివ' చిత్రం సమయంలో నాగార్జున తనపై నమ్మకం ఉంచి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఇప్పుడూ అదే విధమైన స్వేచ్ఛను తనకిచ్చారని తెలిపాడు. ఈ కథను తాను నాగ్ కు చెప్పిన తరువాత, ఎంతో ఎగ్జయిట్ అయ్యారని, తాను అంతే స్థాయిలో సినిమాను తీయనున్నట్లు పేర్కొన్నాడు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT