Telugu Gateway
Cinema

నాని ఎంసిఎ విడుద‌ల డిసెంబ‌ర్ 21న‌

నాని కొత్త సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. నాని..ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 31న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా ఉన్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు స్వ‌యంగా ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఎంసిఎ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌స్తుందని..ఇది కూడా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లో /ఉన‌్న ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారని తెలిపారు. . విజ‌యాలు సాధిస్తున్న నానికి ఈ ‘ఎంసీఏ’ చిత్రం మ‌రో మెట్టుకానుంది. రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ రెండు పాట‌ల‌ను స్పెయిన్‌లో చిత్రీక‌రిస్తాం. నాలుగు రోజుల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తామ‌ని తెలిపారు.

Next Story
Share it