Telugu Gateway
Telugu

మోడీకి కొత్త ‘కిక్’ ఇచ్చే వార్త

అవును. ఓ వైపు పెద్ద నోట్ల రద్దుపై దుమారం. మరో వైపు జీఎస్టీ గందరగోళం. వెరసి సొంత పార్టీ నుంచే విమర్శల వెల్లువ. ఓ వైపు గుజరాత్ ఎన్నికలు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల విమర్శల దాడి. ఈ తరుణంలో మోడీకి మాంచి కిక్ ఇచ్చే వార్త వెలువడింది. అదీ 13 సంవత్సరాల తర్వాత భారత్ కు ఓ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ రావటం బిజెపి సర్కారుకు కొత్త జోష్ ఇచ్చేదే. అదేంటో మీరూ చూడండి. మోదీ సర్కార్‌కు రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తీపికబురు చెప్పింది. 13 సంవత్సరాల తర్వాత భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ సంస్కరణలకు కితాబిచ్చింది. వ్యవస్ధాగత సంస్కరణల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మూడీస్‌ సంస్థ భారత్‌ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు సవరించింది.

దేశ స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్‌ను పీ-3 నుంచి పీ-2కి మార్చింది. సంస్కరణల జోరుతో దేశంలో వాణిజ్య పరిస్థితి, ఉత్పాదకత మెరుగవుతాయని రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను సైతం స్టేబుల్‌ నుంచి పాజిటివ్‌కు మార్చింది.దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్‌టీని మూడీస్‌ ప్రశంసించింది. జీఎస్‌టీ అమలుతో అంతరాష్ర్ట వాణిజ్యానికి ఎదురవుతున్న అవరోధాలు తొలిగి ఉత్పాదకత మరింత పెరుగుతుందని పేర్కొంది. అయితే భారత్‌కున్న అధిక రుణ భారం దేశ పరపతి ప్రతిష్టకు ప్రతికూలమని ఆందోళన వ్యక్తం చేసింది. సంస్కరణల వేగం పెరుగుతున్న రుణ భారం రిస్క్‌ లను తగ్గించగలవని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.

Next Story
Share it