Telugu Gateway
Cinema

జూలీ 2 మూవీ రివ్యూ

సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవాలంటే హీరోయిన్లు ఎంత ఇబ్బంది పడాలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. సినిమాల్లో ఛాన్స్ కావాలంటే కొంత మంది దర్శక, నిర్మాతలు ఎలా వ్యవహరిస్తారో కొంత మంది నటీమణులు ఈ మధ్యకాలంలో బహిరంగంగానే చెప్పేస్తున్నారు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఇవన్నీ తప్పవంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంఘటలను జూలీ 2 సినిమా కళ్ళకు కట్టినట్లు చూపెడుతుంది. ఎంత అందంగా ఉన్నా..నటనలో ఎన్ని డిగ్రీలు ఉన్నా ..నిర్మాతలు చెప్పినట్లు చేయకపోతే ఛాన్స్ కష్టమనే విషయాన్ని జూలీ (రాయ్ లక్ష్మీ) అతి తక్కువ కాలంలోనే గ్రహిస్తుంది. తొలుత ఎలాంటి డిమాండ్లు లేకుండా ఓ సినిమా ఛాన్స్ వచ్చినా ..చేతికందిన డబ్బు కాస్తా కరిగిపోతోంది. మళ్ళీ సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతల డిమాండ్లు తీర్చటానికి రెడీ అయిపోతుంది. అందులో భాగంగానే ఓ పొలిటికల్ బ్రోకర్ గా చెలామణి అయ్యే వ్యక్తి భార్య జీవిత కథలో నటించేందుకు అంగీకరిస్తుంది. అదే ఆమె ప్రాణం మీదకు తీసుకొస్తుంది. అసలు ఆ బయోపిక్ కు..జూలీ చిక్కుల్లో పడటానికి కారణం ఏమిటనేది వెండితెరపైనే చూడాలి.

దర్శకుడు శివదాసాని పరిశ్రమలోని వాస్తవాలను కళ్ళకుకట్టినట్లు చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. పలు సీన్లలో గ్లామర్ డోస్ ను పీక్ కు తీసుకెళ్ళింది. సినీ నిర్మాతల వ్యవహరశైలి..అసలు పెట్టుబడిదారులు ఎవరో తెలియకుండా సాగే దందాలను ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. తనకు 50వ సినిమా కావటంతో రాయ్ లక్ష్మీ దీనిపై భారీ ఆశలే పెట్టుకుంది. మరి జూలీ 2 ఆమె ఆశలు ఏ మేరకు నెరవేరుస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో పోలీసు అధికారిగా నటించిన ఆదిత్య శ్రీవాస్త నటన బాగుంది. చూస్తుంటే జూలీ2 సినిమాలో దర్శకుడు కేవలం రాయ్ లక్ష్మీ అందచందాలపైనే ఆధారపడినట్లు కన్పిస్తోంది.

రేటింగ్.2/5

Next Story
Share it