Top
Telugu Gateway

మైట్రో...రయ్ రయ్ కు లైన్ క్లియర్

సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత భాగ్యనగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అయింది. ఎట్టకేలకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. దీంతో ఇంత కాలం ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నవంబర్ నెలాఖరు నుంచి హైదరాబాద్ ప్రజలు మెట్రో ప్రయాణ అనుభూతిని చూడనున్నారు. తొలి దశలో నాగోల్‌–అమీర్‌పేట, మియాపూర్‌– అమీర్‌పేట రూట్లలో మొత్తం 30 కి.మీ. మార్గంలో మెట్రో ప్రారంభం కానుంది. మెట్రో రైలులో ప్రయాణించేందుకు కనీస చార్జీ రూ. 12.. గరిష్టంగా రూ. 20 ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఒకేరోజులో అపరిమిత ప్రయాణానికి వీలుగా జారీచేసే డే పాస్‌ ధర రూ. 50 నుంచి రూ. 60 లోపు ఖరారు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే దీనిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. త్వరలోనే ఈ రేట్లకు సంబంధించి క్లారిటీ రానుందని చెబుతున్నారు. ప్రధాని ప్రారంభించిన తర్వాత నుంచి ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తొలుత రైళ్ల ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుందని..క్రమక్రమంగా ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని తెలిపారు.

Next Story
Share it