Telugu Gateway
Cinema

‘టెంపర్’ అసలు కథ ఇదీ

చెల్లని చెక్కు కేసులో..అరెస్టు..ఆపై బెయిల్ అంశంపై నిర్మాత బండ్ల గణేష్ మీడియాకు ఓ వివరణ ఇచ్చారు. అసలు టెంపర్ కథ ఇదీ అంటూ పలు అంశాలు వెల్లడించారు. అదేంటో మీరూ చూడండి. ‘ కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుండి కొనడం జరిగింది.సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ శెట్టి కి సంయుక్తంగా విక్రయించాం. కానీ నాకు తెలియకుండా టెంపర్ కథను ఇంగ్లీష్ నవల హక్కుల వారికి రచయిత వంశీ అమ్మాడు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికి లోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టి కి తీసుకు వచ్చాను.అదే సమయం లో టెంపర్ చిత్ర కథ కి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశాను.ఈవివాదం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నప్పటికీ వంశీ చెక్ ను పట్టుకొని కోర్టు కి వెళ్ళడు నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు వారు తుది తీర్పు ను ఇవ్వటం జరిగింది అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను.

ఈ విషయం పై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్ కు వెళ్తున్నాను. రచయిత వంశీ పై నా న్యాయ పోరాటం సాగిస్తాను. టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో,ఏమిటో నాకు నా సినిమా యూనిట్, సినిమా సహాయ రచయితలకు,వంశీ మనసాక్షికి తెలుసు.....,సినిమా రంగంలో నటులకు,దర్శకుల,సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితి లో ఉన్నానా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకోగలరు’ అంటూ తన వివరణను ముగించారు బండ్ల గణేష్.

Next Story
Share it