Telugu Gateway
Cinema

హ‌లో షెడ్యూల్ చెప్పేసిన అఖిల్‌

అక్కినేని అఖిల్. తొలి సినిమా ఘోర ప‌రాజ‌యం పొంద‌టంతో రెండ‌వ సినిమా హ‌లోపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టారు. అందులో భాగంగా న‌వంబ‌ర్ 16న టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా విడుద‌ల 22న విడుద‌ల కానుంది. సంక్రాంతి సెల‌వుల‌ను పుర‌స్క‌రించుకుని చాలా ముందుగానే ఈ సినిమా విడుద‌ల ప్లాన్ చేసిన‌ట్లు క‌న్పిస్తోంది. అఖిల్ హీరోగా ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రమే ఈ ‘హలో!’.మంగ‌ళ‌వారం నాడు విడుద‌ల చేసిన పోస్టర్ లో టీజ‌ర్‌..విడుద‌ల తేదీల‌ను పేర్కొన్నారు. హాలీవుడ్ రేంజ్‌లో అఖిల్ విన్యాసం చేస్తున్న ఈ పోస్టర్‌ సెలబ్రిటీల ప్రశంసలను అందుకుంటోంది.

Next Story
Share it