Home Telangana వెంకయ్యపై కెసీఆర్ అంత ప్రేమకు కారణమేంటో?

వెంకయ్యపై కెసీఆర్ అంత ప్రేమకు కారణమేంటో?

venkaiah naidu

తెలంగాణలో ఓ వైపు స్కూలు  ఆడపిల్లలు టాయిలెట్ కు వెళ్లాలంటే  పొదల్లోకి వెళతారు. ఓ పెద్ద ఫోటో ఈ మధ్యే పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. మరో వైపు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు అరకొరే. కనీస వసతులు లేకుండా విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదీ వాస్తవ పరిస్థితి. వీటిని చక్కదిద్దాల్సిన సర్కారు అవి వదిలేసి..సన్మానాల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలంగాణ సర్కారు చేసిన పౌరసన్మానం సందర్భంగా జారీ చేసిన ప్రకటనల ఖర్చు ఏకంగా 15 కోట్ల రూపాయలపైనే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  సర్కారు తీరు చూసి ఉన్నతాధికారులు కూడా అవాక్కవుతున్నారు. ఉప రాష్ట్రపతి తొలి రాష్ట్రానికి వచ్చిన సమయంలో సన్మానం చేయటం తప్పేమీకాదని..అయితే దానికి ఇంత హంగామా అవసరం లేదంటున్నారు. అసలు మంత్రులు అందరూ పది గంటలకు విధిగా హాజరుకావాలని..జీఎడీ పదే పదే కోరింది. ఇదంతా ఒకెత్తు అయితే కోట్ల రూపాయల ప్రకటనలపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిందని లేదని చెబుతున్నారు. ఈ సన్మాన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యవహరించిన తీరు కూడా ఆశ్చర్యకరంగా మారింది.

                              వెంకయ్యనాయుడికి కెసీఆర్  తిలకం దిద్ది..అత్తరు పూసి..పన్నీరు చల్లి మరీ సన్మానించటం వెనక కారణాలు ఏమిటా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏ రాజకీయ కారణం లేకుండా కెసీఆర్ లాంటి వ్యక్తి ఇలా చేయరని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత ఉంది కానీ..ఉద్యమ సమయంలో వెంకయ్యనాయుడు..చంద్రబాబునాయుడులను ఇద్దరు నాయుళ్ళు తెలంగాణకు అడ్డుపడుతున్నారని టీఆర్ ఎస్ అగ్రనేతలు అందరూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరి అకస్మాత్తుగా వెంకయ్యనాయుడిపై ఇంత ప్రేమ పుట్టుకురావటానికి కారణం ఏంటి?. తెలంగాణ బలమైన రెడ్డి సామాజిక వర్గం సీఎం కెసీఆర్ పై కత్తులు దూస్తోంది. వీరంతా రకరకాలుగా ఎలాగైనా కెసీఆర్ ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచించుకుంటున్నారు.

                                ఇదే అంశంపై అధికార టీఆర్స్ పార్టీ కూడా బహిరంగంగానే ఎదురుదాడి చేస్తోంది. ఈ సమయంలో కెసీఆర్ వెంకయ్యనాయుడిని ఏకంగా అంతగా ఎత్తుకోవటానికి ప్రధాన కారణం తెలంగాణలో ఉన్న వెంకయ్యనాయుడి సామాజికవర్గాన్ని కొంత మేర అయినా తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారని..అందుకే  వెంకయ్యను అంతగా పైకి ఎత్తారని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. టీడీపీ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో అగమ్యగోచరంగా ఉండటంతో వారంతా తమ వైపు చూసేలా చేసుకోవటమే లక్ష్యంగా ఇది సాగిందని చెబుతున్నారు.  తెలంగాణలో ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే పెద్ద నేతలు ఎవరూ లేరు. ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎలాగూ టీఆర్ఎస్ లోనే మంత్రిగా ఉన్నారు. అందుకే ఉన్నంతలో వారిని తమవైపు తిప్పుకోవటానికి కెసీఆర్ ఇంత తాపత్రయం పడినట్లు కన్పిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

 

1 COMMENT

  1. I do not think , a fresh appeasement is needed . ”Velkam’ group is already working , looting public money …3 am friends of KCR , KAVITA , KTR , harish are exclusive members of ‘ velkam ‘ industry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here