Home Latest News అశ్లీల వెబ్ సైట్ నిర్వాహకుడు ప్రదీప్ అరెస్టు

అశ్లీల వెబ్ సైట్ నిర్వాహకుడు ప్రదీప్ అరెస్టు

website

టాలీవుడ్ కు  చెందిన నటీనటులపై అభ్యంతరకర రీతిలో పోస్టులో పెడుతున్న వెబ్ సైట్లకు కష్టకాలం మొదలైంది. మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా బెంగుళూరు కేంద్రంగా మూడు అశ్లీల వెబ్ సైట్లను నిర్వహిస్తున్న ప్రదీప్ ను సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఆదివారం హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

                        30 వెబ్‌సైట్లపై ఫిర్యాదు ఇటీవలి కాలంలో సినీ ప్రముఖుల గురించి అసభ్యకర, అభ్యంతరకర రాతలు రాస్తూ..డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.  ప్రధానంగా తాము గుర్తించిన 30 వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానెళ్లను వెంటనే నిషేధించాల్సిందిగా కోరింది. మిగిలిన వెబ్‌సైట్ల అడ్మిన్లను కూడా అతి త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే ఈ అశ్లీల కథనాలు పోస్ట్ చేసే వెబ్ సైట్ల మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here