Home Andhra Pradesh ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి ప్రమాణస్వీకారం

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి ప్రమాణస్వీకారం

Venkaiah naidu

భారత నూతన ఉప రాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వెంకయ్యనాయుడితో  ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, కేంద్ర మంత్రులు..ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

                             దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువారైన వెంకయ్యనాయుడు బాధ్యతలు స్వీకరిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు హిందీలో ప్రమాణ స్వీకార  చేశారు. అనంతరం అక్కడ ఉన్న ఓ పుస్తకంలో సంతకం చేశారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మొదట రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు. అటుపై మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు.. ఉపరాష్ట్రపతికి నమస్కరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here