Home Cinema వరుణ్ తేజ్ జోడీగా రాశీఖన్నా

వరుణ్ తేజ్ జోడీగా రాశీఖన్నా

Varun tej, raasi kanna

వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైంది. ఈ సినిమాలో మెగా హీరోకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ వైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా షూటింగ్ లో బిజీగా  ఉండగానే కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరిన దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఫిదా మీద ఆశలు పెట్టుకున్న వరుణ్ ఆలశ్యం చేయకుండా చేతిలో ఉన్న సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ముకుంద, కంచె సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినా..పూర్తి స్థాయి సక్సెన్ ను అందించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఈ మెగా హీరో సూపర్ డూపర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వరుణ్ చేసిన లోఫర్…మిస్టర్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here