Home Latest News మోడీకి ఉత్తమ్ లేఖ

మోడీకి ఉత్తమ్ లేఖ

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ తొలి పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులకు వాడుకుంటోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్ది ప్రధానికి ఓ బహిరంగ  లేఖ రాశారు. అందులో మిషన్ భగరీధ ప్రాజెక్టును ప్రారంభించవద్దని ఆయన కోరారు. ప్రధాని తెలంగాణ పర్యటనను కేసీఆర్ తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రారంభమైన ఎల్లంపల్లి-హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్ట్ ను మిషన్ భగీరథగా మార్చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.3,350 కోట్లతో ఆ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయాలని, నిధులు కేటాయిస్తున్నట్లు తన పర్యటనలో ప్రకటించాలని ఉత్తమ్ తన లేఖలో డిమాండ్ చేశారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here