Home Latest News యూపీ సీఎంకు గవర్నర్ ఝలక్

యూపీ సీఎంకు గవర్నర్ ఝలక్

Yogi-Adityanath-meets-Governor-Ram-Naik

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద ఆయుధంగా మారే అవకాశం కన్పిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ పాలన సమయంలో ఉత్తరప్రదేశ్ లో శాంతి, భద్రతల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి తన ప్రధాన లక్ష్యం శాంతి, భద్రతల పునరుద్దరణే అని ప్రకటించారు. కానీ యోగి సీఎం అయిన తర్వాత లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితుల్లో పెద్దగా ఎలాంటి మార్పులేకుండా పోయింది.                               మహిళలపై అత్యాచారాలు యథాతథంగా కొనసాగాయి.

                             ఈ తరుణంలో రాష్ర్ట గవర్నర్‌ రామ్‌ నాయక్‌ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేశాయి. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. తాను గతంలోనూ, ఇప్పుడూ శాంతిభద్రతల పరిస్థితిపై మాట్లాడుతూనే ఉన్నానని, రాష్ర్టంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి మెరుగుపడాల్సి ఉందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.  సురక్షితంగా జీవించే హక్కు ప్రతి మహిళకూ ఉందని, వారికి భద్రత కల్పించడం ప్రభుత్వం, పోలీసుల కర్తవ్యమని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here