Home Latest News యూపీ అసెంబ్లీలో గవర్నర్‌పై కాగితపు బంతులు

యూపీ అసెంబ్లీలో గవర్నర్‌పై కాగితపు బంతులు

UP assembly

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గందరగోళంగా మొదలయ్యాయి. సమావేశం ప్రారంభం కాగానే గవర్నర్‌ రామ్‌నాయక్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతలో ఎస్పీ, బీఎస్పీ సహా ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా.. ప్రసంగిస్తున్న గవర్నర్‌పైకి కాగితపు బంతులు, పోస్టర్లు విసిరారు. దీంతో మార్షల్స్‌ అప్రమత్తమై రామ్‌నాయక్‌కు భద్రత కల్పించారు. ఫైళ్లు, పుస్తకాలతో గవర్నర్‌కు అడ్డంగా నిలుచున్నారు.

                      ఆ సమయంలో ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ కూడా సభలో ఉన్నారు. దీంతో ఆయన ప్రసంగాన్ని ఆపేసి ‘ఉత్తరప్రదేశ్‌ మొత్తం మిమ్మల్ని చూస్తోంది’ అని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలకు గవర్నర్‌ సూచించారు. అయినా వినిపించుకోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉండటంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం తర్వాత నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమవుతున్నదని అంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here