Home Andhra Pradesh విశాఖ ‘సిగ’లో మరో మణిహారం

విశాఖ ‘సిగ’లో మరో మణిహారం

Tu 140 m aircraft

విశాఖ. ఓ అందమైన నగరం. ఇప్పుడు ఆ అందమైన నగరంలో మరో మణిహారం చేరింది. అదే దేశ రక్షణలో 29 ఏళ్ల పాటు అప్రతిహతంగా సేవలందించిన టీయూ– 142ఎం ఎయిర్‌క్రాఫ్ట్‌ . చివరి సారిగా శనివారం విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా విమానాశ్రయంలో దిగింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన ఈ లాంగ్‌ రేంజి మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ 1988 మార్చి 30న నేవీలోకి దూకింది. తర్వాత తమిళనాడు అరక్కోణంలోని ఐఎన్‌ఎస్‌ రజాలి ఎయిర్‌బేస్‌ కేంద్రంగా ఇప్పటి వరకూ సేవలు అందించింది. మార్చి 29న నేవీ సేవల నుంచి నిష్క్రమించిన ఈ యుద్ధ విమానాన్ని విశాఖ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యర్థనకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దీంతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ను అరక్కోణం నుంచి విశాఖలోని నేవీ ఎయిర్‌ బేస్‌కు తీసుకువచ్చారు. ఉదయం 10.55 గంటలకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ చిట్టచివరిసారిగా డేగా రన్‌వేపై వాలింది. సంప్రదాయ బద్ధంగా మూడు చేతక్, రెండు కమోవ్, డోర్నియర్‌ విమానాలు, ఒక అత్యాధునిక పీ–8ఐ యుద్ధవిమానం ఫ్లైఫాస్ట్‌ ను నిర్వహించాయి. ఆ తర్వాత అగ్నిమాపక శకటాలు రన్‌వే నుంచి వస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌– టీయూ 142పై ఇరువైపుల నుంచి వాటర్‌గన్స్‌ ద్వారా నీటిని వెదజల్లాయి. 

                                ఇక ఈ శక్తివంతమైన విమానం విశాఖలో పర్యాటకులకు కనువిందు చేయనుంది. జలాంతర్గామి, యుద్ధ విమానం మ్యూజియాలు ఒకేచోట ఏర్పాటు కావడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. టీయూ–142 యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం ఐఎన్‌ఎస్‌ డేగాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నావికాదళంతో కలసి రాష్ట్రంలో టూరిజం వెంచర్, వాటర్‌ స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్‌ దాదాపు మూడు దశాబ్దాల పాటు ఒక్క ప్రమాదం కూడా లేకుండా భారత నేవీకి విశేష సేవలందిం చిందని తూర్పు నావికాదళ ప్రధానాధికారి హెచ్‌సీఎస్‌ బిస్త్‌ అన్నారు. మాల్దీవుల్లో ఆపరేషన్‌ కాక్టస్, 1998లో ఆపరేషన్‌ విజయ్, 2003లో ఆపరేషన్‌ పరాక్రమ్‌తో పాటు యాంటీ పైరసీ ఆపరేషన్లలోనూ పాల్గొని ఎన్నో విజయాలు చేçకూర్చిందని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here