Home Top Stories ట్రంప్- మోడీ ఆలోచనలు ఒకటేనా!

ట్రంప్- మోడీ ఆలోచనలు ఒకటేనా!

అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే, ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత దగ్గరి స్నేహితుడవుతారని, ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించే నేతలని యుఎస్ మాజీ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఆయన పాల్గొంటూ ఇద్దరూ లక్ష్య సాధనకు ఎంత దూరమైనా వెళ్లే నేతలని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ మిగతా ప్రాంతాన్ని సురక్షి తంగా, ఉత్తమ నివాసయోగ్యాలుగా మార్చేలా దిశా నిర్దేశం చేస్తాయని భావిస్తు న్నట్టు ఆయన తెలిపారు. వీరిద్దరి సహజ లక్షణాలూ ఒకటేనని అన్నారు. ప్రజలను ఏక తాటిపై నడిపించేందుకు వీరి వద్ద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

ఓ డీల్ ఎలా నడపాలో, తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో ఇద్దరు నేతలకూ తెలుసునని, అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై, ఆపై భారత ప్రధానితో కలసి ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వేళ, వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారని జోస్యం చెప్పారు. ఇద్దరిలో స్వీయ విశ్వాసం అధికమని వ్యాఖ్యా నించారు. మోదీపై పొగడ్తలు గుప్పించిన గింగ్రిచ్ గుజరాత్‌ను ఆయన ఎలా మార్చిందీ గుర్తు చేసుకున్నారు. ఇటీవల యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమా వేశంలో ప్రసంగించేందుకు వచ్చిన ఆయనను కలుసుకున్నానని తెలిపారు. రిపబ్లికన్లలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారంతా ట్రంప్‌కు మద్ద తు తెలుపుతున్నారని, ఇది అమెరికా భవిష్యత్తుకు, ఇరు దేశాల మధ్య సత్సం బంధాలకు అత్యంత కీలకమని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here