Home Latest News ట్రూజెట్ ఎయిర్ లైన్స్ తో ప్రయాణికుల కష్టాలు

ట్రూజెట్ ఎయిర్ లైన్స్ తో ప్రయాణికుల కష్టాలు

trujet airlines

సంవత్సరాలకు సంవత్సరాలు గడుస్తున్నా ట్రూజెట్ ఎయిర్ లైన్స్ తీరు మారటం లేదు.  నిత్యం సర్వీసుల రద్దు..ప్రయాణికులకు చుక్కలు చూపించటంలో మాత్రం ఫస్ట్ ఉంటుంది ఈ విమానయాన సంస్థ. సోమవారం నాడు కూడా అదే తీరు. సోమవారం ఉదయం 9.25 గంటలకు రాజమండ్రి బయలుదేరాల్సిన విమానం 11 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. చెన్నయ్ నుంచి విమానం రావాలి..అది బయలుదేరాలి. చివరకు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ట్రూజెట్ కు సంబంధించిన మరో విమానం రిపేర్ లో ఉంది. ప్రతి నెలా సర్వీసుల రద్దు విషయంలో ట్రూజెట్ ముందు వరసలోనే ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్  నెలలోనూ సంస్థది ఇదే పరిస్థితి. ఈ నెలలో ఏకంగా 3.13 శాతం సర్వీసుల రద్దుతో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

                          జూమ్ ఎయిర్ 7.14 శాతం సర్వీసుల రద్దుతో మొదటి స్థానంలో ఉంది. ట్రూజెట్ సర్వీసుల రద్దు విషయంలో ఇదే ట్రెండ్ కొనసాగిస్తోంది.  2017 జనవరి- సెప్టెంబర్ నెలలో దేశీయ ప్రయాణికుల్లో 16.91 శాతం వృద్ధి రేటు నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో దేశీయ ఎయిర్ లైన్స్ ద్వారా 7.26 కోట్ల మంది ప్రయాణించగా..2017 జనవరి -సెప్టెంబర్ లో 8.49 కోట్ల మంది ప్రయాణాలు సాగించారు. 2016 సెప్టెంబర్ లో దేశీయ ప్రయాణికుల సంఖ్య 82.30 లక్షలు ఉండగా…2017 సెప్టెంబర్ లో ఇది 95.83 లక్షలకు పెరిగింది. 94.2 శాతం ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ తో స్పైజ్ జెట్ నెంబర్ స్థానంలో కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here