Home Latest News టీఆర్ఎస్ ఎమ్మెల్సీ దౌర్జన్యం

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ దౌర్జన్యం

TRS-MLC-Farooq-Hussain

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్సీ. ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీచేయమన్నందుకు బూతులు తిట్టారు. దౌర్జన్యం చేశారు. ఏకంగా తనను చెప్పుతో కొట్టినట్లు ఎన్ ఆర్ఐ మహిళ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుసుకుంది. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతుల్‌ వాసే అనే మహిళా ఎన్ ఆర్ ఐకి హైదరాబాద్‌ నాంపల్లిలో ఓ సొంత ఇల్లుంది. గడిచిన పదేళ్లుగా ఫారూఖ్‌ హుస్సేన్‌ ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు. ఇప్పటికీ అతను నామమాత్రపు అద్దె మాత్రమే చెల్లిస్తున్నాడని, నిలదీసి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇంటి యజమాని అంతుల్‌ చెప్పారు.

                                 ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపించింది. విదేశాల నుంచి ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన యజమానురాలు అంతుల్‌.. తన సోదరుడితో కలిసి ఈ రోజు ఉదయం నేరుగా నాంపల్లిలోని ఇంటికి వెళ్లింది. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఫారూఖ్‌ను కోరింది. ఈ క్రమంలో ఇరువురి వాగ్వాదం చోటుచేసుకుంది. ‘అద్దె ఇవ్వను, అపార్ట్‌ మెంట్‌ ఖాళీ చేయను. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవడికి చెప్తావో చెప్పుకో..’ అని ఫారూఖ్‌ బెదిరించినట్లు బాధిత మహిళ ఆరోపించింది. ఒక దశలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ మహిళను చెప్పుతో కొట్టినట్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here