Telugu Gateway
Top Stories

ప్ర‌పంచంలో ప‌వ‌ర్ పుల్ పాస్ పోర్టులు ఇవే

ప్ర‌పంచంలో ప‌వ‌ర్ పుల్ పాస్ పోర్టులు ఇవే
X

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌వ‌ర్ పుల్ పాస్ పోర్టుల జాబితా విడుద‌లైంది. 2022 సంవ‌త్స‌రానికి సంబంధించి తాజాగా ఈ జాబితా విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం జ‌పాన్ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ పాస్ పోర్టుగా నిలిచింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే జ‌పాన్ పాస్ పోర్టు ఉంటే ఏకంగా 193 దేశాల్లోకి ఎంట్రీ అత్యంత సుల‌భం అవుతుంద‌న్న‌మాట‌. అంటే ఈ పాస్ పోర్టు ఉంటే ఆయా దేశాల్లోకి నేరుగా వెళ్లిపోవ‌చ్చు. లేదంటే వీసా ఆన్ అరైవ‌ల్ కింద వెళ్లొచ్చు అన్న‌మాట. జపాన్ త‌ర్వాత స్థానాన్ని సింగ‌పూర్, దక్షిణ కొరియాలు ఆక్ర‌మించాయి. ఈ రెండు దేశాల పాస్ పోర్టుల‌తో 192 దేశాల్లో విహ‌రించొచ్చు. జ‌ర్మ‌నీ, స్పెయిన్ లు మూడవ స్థానంలో ఉన్నాయి. వీటికి 190 దేశాల్లో ఈజీగా సంచ‌రించే ఛాన్స్ ఉంటుంది.

ఫిన్లాండ్, ఇటలీ నాల్గ‌వ స్థానంలో, ఆస్ట్రియా, డెన్మార్ లు ఐద‌వ స్థానంలో ఉన్నాయి. హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ తాజాగా ఈ జాబితాను విడుద‌ల చేసింది. భార‌త పాస్ పోర్టు కు ఈ జాబితాలో 87వ ర్యాంకు రాగా...ఈ పాస్ పోర్టుతో వీసా లేకుండా..ఆన్ అరైవ‌ల్ వీసాతో 60 దేశాలు వెళ్లొచ్చు. అగ్ర‌రాజ్యం అమెరికాకు ఏడ‌వ ర్యాంకు ఉంది. అమెరికాపాస్ పోర్టుతో 186 దేశాలు, యూకె ఆర‌వ ర్యాంకుతో 187 దేశాల్లో ప‌ర్యటించ‌వ‌చ్చు. చైనా 69వ ర్యాంకు పొందింది. ర‌ష్యా పాస్ పోర్టుకు 50వ ర్యాంకు రాగా...119 దేశాల్లో ఈ పాస్ పోర్టు తో సుల‌భంగా ఎంట్రీ వెసులుబాటు ద‌క్కుతుంది.

Next Story
Share it