Home Cinema టాలీవుడ్ లో ‘సినిమా’ల పండగ

టాలీవుడ్ లో ‘సినిమా’ల పండగ

rana-nithin-bellamkonda

చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు సినిమా పండగ వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా ఓకేసారి మూడు సినిమాలు విడుదల కాలేదు. అది దసరా..సంక్రాంతి వంటి కీలక పండగల సమయంలోనే జరిగేది. కానీ ఎలాంటి పండగలు లేకపోవటంతో సినిమాలే పండగ చేస్తున్నాయి. అయితే ఈ పండగకు సెలవులు బాగా కలిసొచ్చాయి.  ఈ శనివారం నుంచి ఆగస్టు 15 వరకూ సెలవులే సెలవులు. ఇంకేమి కావాలి చూసినోళ్ళకు చూసినన్ని సినిమాలు అన్నట్లు ఉంది పరిస్థితి. హీరో నితిన్ ‘లై’ అంటూ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా..బాహుబలిలో బళ్లాళదేవుడుగా దుమ్మురేపిన రానా ‘నేనేరాజు..నేనే మంత్రి’ అంటూ హల్ చల్ చేస్తున్నారు.

                               మరోవైపు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక కూడా శుక్రవారం నాడే విడుదలైంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయగా..ఆయనకు జోడీ రకుల్ ప్రీత్ సింగ్…ప్రగ్యా జైస్వాల్ లు సందడి చేస్తున్నారు. మరి ఈ సినిమా పండగలో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచిచూడాల్సిందే. ఎవరికి వారుచాలా ధీమాతోనే సినిమాలను ఒకేసారి విడుదల చేయటానికి ధైర్యం చేశారు. మరి ఫలితం ఎవరివైపు మొగ్గుతుందో వేచిచూడాల్సిందే.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here