Home Telugu ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి

ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి

oxygen

దారుణ సంఘటన. ఆక్సిజన్ అందక ఏకంగా 30 మంది చిన్నారుల మృతి. అదీ కాంట్రాక్టర్ కు బకాయిలు చెల్లించలేదని..ఆక్సిజన్ సరఫరా నిలిపివేయటం..ఇదే కారణంతో చిన్నారుల మృతి. ఈ వ్యవహారం బిజెపి పాలిత రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో పెద్ద కలకలం రేపుతోంది. కేవలం 48గంటల్లో 30మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరంతా మెదడు వాపు వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నవారే. ఈ ఘటన  ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

                              గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ ఆస్పత్రిలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెలా తెలిపారు. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ ఆస్పత్రికి తనిఖీకోసం వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి వారంతా సమస్యల ఏకరువు పెట్టగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం మరో 45మంది చిన్నారులు వెంటిలేషన్‌పై ఉన్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here