Telugu Gateway
Telangana

తెలంగాణలో అమెజాన్ 20,761 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో అమెజాన్ 20,761 కోట్ల పెట్టుబడి
X

తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఏకంగా రాష్ట్రంలో 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది. పలు దఫాల చర్చల అనంతరం అమెజాన్ రాష్ట్రంలో పెట్టుబడికి ఓకే చేసిందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిది. తెలంగాణకు చెందిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ గురువారం నాడే పెద్ద పెట్టుబడి ప్రతిపాదనలను వెల్లడించనున్నట్లు తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని తెలిపారు.

చెప్పినట్లుగానే ఆయన శుక్రవారం నాడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణలో కంపెనీ పలు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుందని తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూనిట్ 2022 మధ్యలో రెడీ కావొచ్చన్నారు. ఈ వెబ్ సర్వీసెస్ సంస్థ అమెజాన్ అనుబంధ కంపెనీ. క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్లాట్ ఫామ్స్ అందిస్తుంది. అమెరికాలోని సియాటెల్ కంపెనీ ప్రధాన కేంద్రం.

Next Story
Share it