Home Latest News టీచర్ వికృత వేషాలు

టీచర్ వికృత వేషాలు

fazidduin lashkar

ఆయన టీచర్. వయస్సు కూడా తక్కువేమీ కాదు. కానీ ఆయన వికృత వేషాలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తన స్కూల్ లో చదువు కోవటానికి వచ్చే అమ్మాయితో అత్యంత సన్నిహితంగాచేతులు వేసి మరీ ఫోటోలు దిగాడు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. సదరు టీచర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోటోలను టీచరే సోషల్ మీడియాలో పెట్టడం దుమారం రేపుతోంది. అస్సాం  రాష్ట్రంలోని హైలాకంది జిల్లా కట్లిచెర్రా పట్టణానికి చెందిన ఫైజుద్దీన్ లస్కర్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే బాలికలతో కలిసి అభ్యంతరకరంగా ఫోటోలు దిగాడు. ఉపాధ్యాయుడు బాలికలను ఆలింగనం చేసుకోవడంతోపాటు అసభ్య భంగిమలతో ఫోటోలు దిగాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

                            ఉపాధ్యాయుడు ఫైజుద్దీన్ లష్కర్ ఓ బాలికను పెళ్లాడాలని అనుకున్నారు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో ఉపాధ్యాయుడు ఫైజుద్దీన్ పెళ్లి చెడగొట్టేందుకు తాను బాలికలతో దిగిన ఫోటోలన్నీమరో వ్యక్తి సాయంతో సోషల్ మీడియాలో పెట్టించాడని జిల్లా ఎస్పీ గోస్వామి అసలు విషయం చెప్పాడు. కీచక ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ 192, సెక్షన్ 67, ఐటీ యాక్టు సెక్షన్ 8, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ అమ్మాయితో ఒక్కరితోనే ఇలా వ్యవహరించారా? లేక మిగతా పిల్లలను కూడా వేధించారా అన్న అంశంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here