Home Andhra Pradesh విశాఖ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ హంగామా

విశాఖ విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ హంగామా

jc diwakar reddy

ఆయన సీనియర్ నేత. అధికార  తెలుగుదేశం పార్టీ ఎంపీ. నిబంధనల ప్రకారం సమయం ముగిశాక..ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయినా సరే తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కోరారు. అందుకు సిబ్బంది నో చెప్పటంతో ..వీరంగం సృష్టించారు. అంతే కాదు..ఆ ఎయిర్ లైన్స్ కౌంటర్ లో ఉన్న బోర్డింగ్ పాస్ లను వెలికితీసే ప్రింటర్ ను కూడా పక్కకు నెట్టేశారు.  దీంతో సిబ్బంది అవాక్కు అయ్యారు. సాక్ష్యాత్తూ ఓ సీనియర్ ఎంపీ ఇలాంటి చర్యకు పాల్పడటంతో ఎయిర్ పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

                                ఇదంతా చేసింది ఎవరో తెలుసా?. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.  గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో ఈ హాంమా అంతా సాగింది. ఇండిగో విమానంలో హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ ఉదయం ఆయన విమానాశ్రయానికి వచ్చారు. బోర్డింగ్‌ పాస్‌ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు. సమయం ముగిసిన తర్వాత కూడా ఎంపీ అయిన ఉండి జెసీ బోర్డింగ్ పాస్ కోసం ఆందోళన చేయటం సరికాదని ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యాఖ్యానించారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here