Home Latest News టీ టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్

టీ టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్

Tdp

తెలంగాణ తెలుగుదేశంలో పరిణామాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇటీవల వరకూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవినీ వదులుకున్నారు. ఇప్పుడు మరో వికెట్ పడింది. తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లేఖను ఆదివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఎన్టీఆర్‌ పిలుపుమేరకే రాజకీయాల్లోకి వచ్చానని వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. జీవితమే తెలుగుదేశం పార్టీగా పని చేశానని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో నాయకత్వం లోటు కనిపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే.

                                 అందుకే ఆయన కూడా కాంగ్రెస్ బాట పట్టడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ఇంకా టీ టీడీపీ నుంచి ఎంత మంది నేతలు బయటకు పోతారనే విషయంపై సోమవారం నాడు మరింత క్లారిటీ రానుంది. జలవిహార్ లో రేవంత్ రెడ్డి సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎంత మంది టీ టీడీపీ నేతలు హాజరు అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి  ఈ నెల 31న మరికొంత మంది నేతలతో కలసి రాహుల్ సమక్షంలో కాంగ్రస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here