Home Latest News టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

seethakka

తెలంగాణ తెలుగుదేశంపై రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ బాగానే పడుతోంది. ఆయనతో కలసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు నేతలు క్యూకడుతున్నారు. ఆ జాబితాలో తాజాగా మాజీ ఎమ్మెల్యే, ములుగు నియోజకవర్గ ఇన్ ఛార్జి సీతక్క కూడా చేరిపోయారు. ఆమె మంగళవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పంపారు. తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.

                                  రేవంత్ రెడ్డితోపాటు టీడీపీకి చెందిన పలువురు జిల్లా అధ్యక్షలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం సాయంత్రం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. 2014లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీతక్క.. అజ్మీరా చందూలాల్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత పర్యాటక మంత్రి చందూలాల్‌ కూడా ఒకప్పటి టీడీపీ నేతే కావటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here