Home Andhra Pradesh ‘జైలవకుశ’పై టీడీపీ శ్రేణుల దుష్ప్రచారం ప్రారంభం!

‘జైలవకుశ’పై టీడీపీ శ్రేణుల దుష్ప్రచారం ప్రారంభం!

jai lava kusa

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జైలవకుశ’ సినిమా గురువారం నాడే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ రిపోర్ట్సే వచ్చాయి. ఏ సినిమా అయినా అందరికీ నచ్చాలని లేదు. ఎంత గొప్పగా తీసిన సినిమాను అయినా విమర్శించే వాళ్ళు ఉంటారు. నచ్చనివాళ్ళు ఉంటారు. అది వారి వారి అభిరుచులను బట్టి ఉంటుంది. అది సహజమే. ఎన్టీఆర్ విషయంలో గతంలోనూ ఇలాగే జరిగింది. ఈ హీరోకు చెందిన పలు సినిమాలు బాగున్నా కూడా నెగిటివ్ ప్రచారం వల్ల దెబ్బతిన్నాయి. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏవైతే  బాహుబలి సెట్టింగ్ లు చూసి ఏరికోరి అమరావతి డిజైన్ల విషయంలో సలహాలు, సూచనల కోసం పిలిచి మూడుసార్లు మాట్లాడిన రాజమౌళే జైలవకుశ సినిమా చూసి తారక్ పై  అద్భుత ప్రశంసలు కురిపించారు. కానీ అమరావతి కేంద్రంగా ఎంపిక చేసిన టీడీపీ శ్రేణుల  వాట్సప్ ల్లో జైలవకుశ సినిమాపై దుష్ప్రచారం మొదలైంది.

                          విశేషం ఏమిటంటే తెలుగుదేశం బీట్ చూసే పాత్రికేయులకు కూడా ఈ మెసేజ్ లు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో సర్కులేట్ అవుతున్న మెసేజ్ సారాంశం ఇదే. ‘బాక్సాఫీస్ ముందు బోల్తాకొట్టిన జైలవకుశ. కథలో కొత్తదనం లేకపోవటం..కథనాన్ని రక్తి కట్టించలేకపోవటం పెద్దలోపాలుగా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు. జైలవకుశ కన్నా పైసావసూలు బెటర్ అంటున్న ప్రేక్షకులు’. ఇదీ భారీగా సర్కులేట్ అవుతున్న వాట్సప్ మెసేజ్. అంతిమంగా సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. చూడాలి టీడీపీ శ్రేణుల నెగిటివ్ ప్రచారం ఎంత వరకూ వెళుతుందో.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here