Home Top Stories మొక్కులు సొంత డబ్బుతో తీర్చుకోవాలి

మొక్కులు సొంత డబ్బుతో తీర్చుకోవాలి

Tammineni-Veerabhadram

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మొక్కుల చెల్లింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సామాజిక మాధ్యమాల్లో కూడా మొక్కులు ఎవరైనా సొంత డబ్బుతో చెల్లిస్తారు కానీ..ప్రభుత్వ డబ్బుతో చేస్తారా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇదే ప్రశ్న సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా లేవనెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తిరుమల వెంకన్నకు తన మొక్కులు చెల్లించుకోవడానికి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని  ఆయన విమర్శించారు.

                                  ప్రజల సొమ్ముతో కాకుండా.. సొంత సొమ్ముతో ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనకుండా జేఏసీ చైర్మన్‌ కోదండరాం అరెస్టు చేయడాన్ని ఖండించారు.              అరెస్టు చేసిన ఉద్యమకారుల్ని వెంటనే విడుదల చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇఛ్చిన విధంగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ  చేయాలని కోరితే పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయటం సరికాదన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here