Home Latest News బాబూ..ప్లీజ్ నిప్పు..నిజాయతీపదాలు వాడకు

బాబూ..ప్లీజ్ నిప్పు..నిజాయతీపదాలు వాడకు

talasani_srinivas_yadav

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మరోసారి ఛాన్స్ తీసుకున్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో తీసుకోవటంతో తీవ్ర విమర్శలు చేశారు. ఇకనైనా చంద్రబాబునాయుడు నిప్పు..నిజాయతీ వంటి పదాలు వాడకుండా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇవి ఆయనకు ఏ మాత్రం సూట్ కావని ఎద్దేవా చేశారు.  మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే అప్పుడు తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు.

                             టీడీపీలో క్రమశిక్షణ ఎన్టీఆర్‌ తోనే పోయిందన్నారు. చంద్రబాబును చూసి నేతలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారన్నారు. గతంలో తనపై, కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసి ఇప్పుడు చంద్రబాబు చేసిందేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోషల్‌ మీడియాను ఒకసారి చంద్రబాబు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని తలసాని అన్నారు. 2004లో కంటే 2019 ఎన్నికలలో ఏపీలో ఘోరమైన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here