Home Andhra Pradesh భూ స్కామ్ పై చంద్రబాబుకు బిజెపి లేఖ

భూ స్కామ్ పై చంద్రబాబుకు బిజెపి లేఖ

SOMU VEERRAJU

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని భాగస్వామి బిజెపి కూడా వైజాగ్ భూ స్కామ్ ను సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పలుమార్లు ఈ స్కామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇదే అంశంపై చంద్రబాబుకు లేఖ రాశారు. అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారుతూ అధికారంలోకి వచ్చినవారే భూ దందాలకు పాల్పడుతున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పరోక్షంగా ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావునే టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో రంజుగా మారే అవకాశం కన్పిస్తోంది.

                          ఎవరు అధికారంలోకి ఉంటే..వారి దగ్గరికి చేరే వారికి  గేట్లు మూసేయాలని, భూ దందాలపై విచారణ జరపాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. భూ దోపిడీకి పాల్పడేవారికి చరమగీతం పాడాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కొన్ని మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటున్నాయని సోము వీర్రాజు వివరించారు. కొన్ని దుకాణాలు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని సీఎంను కోరారు. ఒక్కో మద్యం షాప్‌ కింద 20 బెల్టు షాపులు నడుస్తున్నాయని, అధిక రేట్లకు మద్యం అమ్మడంతో సామాన్యులు నష్టపోతున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here