Home Andhra Pradesh సోమిరెడ్డి వర్సెస్ రామ్ గోపాల్ వర్మ

సోమిరెడ్డి వర్సెస్ రామ్ గోపాల్ వర్మ

NTR

రామ్ గోపాల్ వర్మ సినిమా మొదలుపెట్టక ముందే దుమారం మొదలైంది. ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ పనీపాటలేని వ్యక్తి  అని..నిత్యం వివాదాల్లోనే మునిగితేలతారని ఎద్దేవా చేశారు. ఎంతో త్యాగశీలి అయిన లక్ష్మీపార్వతినే సినిమాలో పెట్టుకోవాలని సూచించారు. రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటారా? ఆయనా వెంటనే స్పందించారు. సోమిరెడ్డి ఉచిత సలహాకు థ్యాంక్స్. సోమిరెడ్డి రెడీ అంటే లక్ష్మీపార్వతి పక్కన నటించే ఛాన్స్ ఆయనకే ఇస్తానంటూ చురక అంటించారు.

                            రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇది పూర్తిగా లక్ష్మీపార్వతి కోణంలోనే ఉంటుందని..చివరి రోజుల్లో ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇందులో చూపించబోతున్నారు. ఇది ఓ రకంగా తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది. ఏపీకి చెందిన మరో మంత్రి నారా లోకేష్ కూడా ఈ సినిమా అంశంపై స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వర్మ సినిమా తీసుకుంటే తీసుకోవచ్చని వ్యాఖ్యానిస్తూ..తాను ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెడతానని..వీటిపై కాదని వ్యాఖ్యానించారు. అది సినిమా మాత్రమే..దానిపై మాట్లాడేది ఏముంటుందని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here