Home Telangana శిరీషపై ఎస్ఐ రేప్ ప్రయత్నం నిజమే

శిరీషపై ఎస్ఐ రేప్ ప్రయత్నం నిజమే

Sirisha, prabakar reddy

బ్యూటీషియన్ శిరీష మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెది హత్య కాదు..ఆత్మహత్యే అని పోలీసులు తేల్చారు. అన్నింటి కంటే ముఖ్యంగా  ఆమెపై కుకునూరిపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి హత్యాచారయత్నం చేయబోయారనే విషయాన్ని ధృవీకరించారు. రాజీవ్ తో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కుకునూరిపల్లి ఎస్ఐ క్వార్టర్ కు వెళ్లగా..క్వార్టర్ లోనే ఆమెపై ఎస్ఐ హత్యాచారయత్నం చేశాడు. అయితే ఆమె పెద్దగా అరుస్తూ…కేకలు వేస్తూ ఈ చర్యను అడ్డుకుంది. తాను అలాంటి దాన్ని కాదని…ఓ గోడకు నక్కి..తనను కాపాడుకునే ప్రయత్నం చేసింది. కుకునూరిపల్లి ఎస్ఐ దగ్గరికి వెళ్లిన ఫోటో స్టూడియో యాజమాని రాజీవ్, శ్రవణ్ లు అదే రాత్రి అక్కడ మందు కొట్టి..సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఎస్ఐ ఈ ప్రయత్నం చేసినట్లు తేలింది.

                               అయితే ఆ సమయంలో ఎస్ఐతోపాటు అందరూ మద్యం సేవించి ఉన్నారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన శుక్రవారం నాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. రాజీవ్ కు …శిరీషకు అక్కడ పనిచేస్తున్న సమయంలో శారీరక సంబంధం కూడా ఏర్పడిందని తెలిపారు. అదే సమయంలో రాజీవ్ కు బెంగుళూరులో పనిచేస్తున్న తేజస్విని అనే అమ్మాయితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని..కాలక్రమేణాతో ఆమెతో కూడా రాజీవ్ శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు.                        మూడు నెలల క్రితమే తేజస్విని  బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్  చేయించుకుని వచ్చింది. రాజీవ్.. తేజస్విని చాలా కాలం పాటు ప్రేమ పేరుతో ముందుకు సాగారు. ఫిజికల్ హైదరాబాద్ వచ్చాక రాజీవ్ తనను  నిర్లక్ష్యం చేస్తున్నాడనే నిర్ణయానికి వచ్చిన తేజస్విని రాజీవ్ ఆఫీసుకు రాగా..ఆమెకు అక్కడి ఆఫీస్ బాయ్స్  సార్ తన భార్యతో కలసి బయటికి వెళ్లారని చెప్పటం ఆమె అవాక్కు అయింది. తర్వాత అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

                              ఒక సారి ఆఫీసుకు వచ్చి అటు రాజీవ్ తోనూ..శిరీషతో ఆమె పెద్ద  ఎత్తున గొడవ చేసింది. దీంతో రాజీవ్ డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో మౌఖికంగా పిర్యాదు చేశారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి తేజస్విని వెళ్లిపోయింది. శిరీష ఈ గొడవకు ముగింపు పలకాలని శ్రావణ్ ను కాంటాక్ట్ చేయగా…తనకు ప్రభాకర్  రెడ్డి ఎష్ఐ తెలుసు..అతని ద్వారా పరిష్కారం చేద్దామన్నారు.    ప్రభాకర్ రెడ్డి తన బ్యాచ్ మెట్ అయిన బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్ కు ఈ వ్యవహారాన్ని తెలిపాడు. అక్కడ విషయం తేలకపోవటంతో 12వ తేదీ రాత్రి అందరూ కలసి ఓ మందు బాటిల్ కొనుక్కుని కుకునూర్ పల్లి వెళ్లారు. అక్కడే ఈ గొడవ అంతా జరిగింది. పక్కా సైంటిఫిక్ మార్గాల ద్వారా విచారణ జరిపి ఈ వివరాలు సేకరించినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ఇప్పుడు ఈ కేసు పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.   ఏ-1 శ్రావణ్‌, ఏ-2 రాజీవ్‌లను నిందితులుగా చేర్చారు.శ్రవణ్ క్యారెక్టర్ తేడా ఉందని కమిషనర్ తెలిపారు రాజీవ్ పై ఇప్పటి వరకూ  ఎలాంటి కేసులు ఉన్నట్లు సమాచారం లేదని..ఎవరైనా వివరాలు అందిస్తే విచారణ జరుపుతామని తెలిపారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here