Home Latest News శిరీష పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

శిరీష పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

sirisha

హైదరాబాద్ లో కలకలం రేపిన బ్యూటీషియన్ శిరీష పోస్టు మార్టం నివేదిక కలకలం రేపుతోంది. ఈ రిపోర్టు ప్రకారం ఆమెను ఎవరో హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెడపై పెద్ద ఎత్తున ఒత్తిడి తేవటంతోనే ప్రాణాలు పోయినట్లు భావిస్తున్నారు. అంతే కాకుండా ఆమె శరీరంలో పలు చోట్ల గాయాలు కూడా ఉన్నట్లు పోస్టు మార్టం నివేదిక వెల్లడిస్తోంది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇఫ్పటి వరకూ ఆత్మహత్యగా చెబుతూ వచ్చారు. పోస్టు మార్టం నివేదికతో వ్యవహారం మరో మలుపు తిరగనుంది. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు.. గురువారం సాయంత్రం నివేదికను పోలీసులకు అందజేశారు.  

                     ఆ రిపోర్టులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు.  శిరీష మెడ, పెదవి, చెంపలపై బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెడ భాగంలో తీవ్రమైన ఒత్తిడి కలగడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు నిర్వహించిన మీదట.. శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనేదానిపై స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని కోణాల్లో కూడా ఈ నివేదికను అధ్యయనం చేయనున్నారు. ఓ వైపు కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here