Home Latest News బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

sirisha

షాకింగ్. బుధవారం ఉదయమే హైదరాబాద్ లో కలకలం. నిండా ముప్పయి సంవత్సరాలు కూడా లేని ఓ యువతి మృతి చెందింది. అదీ ఆఫీస్ లో. అయితే హత్య..లేక ఆత్మహత్యా అన్న సంగతి విచారణలోనే తేలాల్సి ఉంది. ఆఫీసు నుంచి ఇంటికి లేట్ గా వస్తానని చెప్పిన ఆమె.. మరణవార్త విని ఆమె భర్త షాక్  కు గురయ్యాడు. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి  శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గా.. హెచ్‌ఆర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. మరణానికి ముందు తన భర్త సతీష్‌చంద్రకు ఫోన్‌చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది.

                               అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు. ఎప్పటిలాగానే సతీష్‌ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను కుక్‌గా పనిచేసే ఆశ్రయ్‌–ఆకృతి పాఠశాలకు వెళ్ళారు. తరువాత సతీష్‌చంద్రకు బంజారాహిల్స్‌ పోలీసులు ఫోన్‌చేసి ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. యజమాని వల్లభనేని రాజీవ్‌ను ఏమైందని ప్రశ్నించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే  చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని తెలిపారు. తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదుచేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here