Home Latest News సెక్స్ రాకెట్ లో పట్టుపడ్డ జూనియర్ ఆర్టిస్ట్

సెక్స్ రాకెట్ లో పట్టుపడ్డ జూనియర్ ఆర్టిస్ట్

Sex racket

హైదరాబాద్ లో మరో సెక్స్ రాకెట్ ఒకటి బయటపడింది. అందులో ఓ జూనియర్ ఆర్టిస్ట్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనిక్‌పురి ఆర్కేపురానికి చెందిన యువతి(28), యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో నివసించే జూనియర్‌ ఆర్టిస్ట్(27), అదే కాలనీలో ఉండే మేకప్‌మెన్‌ కె.బండారి (23) ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

                         లోకేట్‌ అనే వెబ్‌సైట్‌లో ఒక విటుడిని బుక్‌ చేసుకొని బోడుప్పల్‌లోని ఎన్‌టీఆర్‌ విగ్రహం దగ్గర అప్పగించడానికి ఓ యువతిని తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి బండారితో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అనంతరం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here