Home Cinema రానాను అన్నయ్య అంటున్న సమంత

రానాను అన్నయ్య అంటున్న సమంత

Samantha

రానాకు నాగ చైతన్య వరసకు బావ అవుతారు. మరి ఈ లెక్కన సమంతకు రానా అన్నయ్యే కదా అయ్యేది. ఈ భామ అదేపనిచేసింది. ఓ..హో మా సూపర్ స్టార్ అన్నయ్య కొత్త సినిమా వస్తుందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది. అందులో రానా ఫుల్ సైజ్ కటౌట్ ను కూడా పోస్టు చేసేసింది ఈ భామ. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ శుక్రవారం విడుదుల కానుంది.  అందుకే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అని ట్వీట్‌ చేసింది. సమంత పెట్టిన ఈ ట్వీట్‌ దుమ్మురేపుతోంది. త్వరలోనే సమంత..నాగచైతన్యల వివాహం జరగనున్న విషయం తెలిసిందే.

                          బాహుబలి సినిమా ద్వారా టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ రానా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత రానా తాజా చిత్రం ఇదే కావటంతో  ఈ సినిమాపై క్రేజ్ కూడా విపరీతంగా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ టిక్కెట్ల బుకింగ్ స్టార్ట్ చేయగా..బుధవారం ఉదయానికే మల్టీఫ్లెక్స్ లో టిక్కెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. ఇదే ఈ సినిమాపై క్రేజ్ ను తెలియజేస్తోంది. నేనే మంత్రి..నేనే రాజు సినిమాలో రానా కు జోడీగా కాజల్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు తేజ ఈ సినిమాను తెరకెక్కించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here