Home Cinema సమంతకు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడా?

సమంతకు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడా?

ప్రస్తుతం ఇదే  వార్త హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న సమంత వ్యూహాత్మకంగా తన  లవ్ ఎఫైర్ ను మీడియా లీక్ చేసిన నానా హంగామా చేసిందనే అభిప్రాయంతో నాగార్జున ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తొలుత ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన నాగార్జున తర్వాత సర్దుబాటు ధోరణితో వ్యవహరించినా..వీరి వ్యవహారం మరీ శ్రుతిమించుతుండటంతో రంగంలోకి దిగి సమంతకు ఒకింత గట్టిగానే హెచ్చరిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలి రోజుల్లో సమంత ప్రేమ వ్యవహారంపై అనుమానం వచ్చేలా వార్తలు రాసిన సోషల్ మీడియా…వెబ్ సైట్లు..తర్వాత తర్వాత ఏకంగా నాగచైతన్య..సమంతల ఫోటోలు పెట్టి మరీ వార్తలు రాసేశాయి.

వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు కలసి షాపింగ్ చేసిన..సినిమా చూసిన ఫోటోలు కూడా బహిర్గతం అయ్యాయి. దీంతో సమంత లవర్ ఎవరో ఇప్పటికే చాలా స్పష్టత వచ్చేసింది. ఇంత జరిగాక కూడా సమంత ఇక రచ్చ ఎందుకు చేస్తుందనే ఆగ్రహంతో నాగార్జున ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇఫ్పటికే జరిగిన ప్రచార రచ్చపై ఆగ్రహంతో ఉన్న నాగార్జున ఈ రచ్చకి పుల్ స్టాప్ పెట్టాల్సిందిగా హెచ్చరించినట్లు సమాచారం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here