Home Cinema తండ్రే తనకు పెద్ద విమర్శకుడు అన్న సల్మాన్

తండ్రే తనకు పెద్ద విమర్శకుడు అన్న సల్మాన్

ప్రేక్షకులకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా సుల్తాన్ కూడా సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు.  ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపారు. ముందుగా ఆయన స్పందనే తనకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత త్రండ్రి సలీం ఖాన్ తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని వివరించారు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని అన్నారు.

నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ పేర్కొన్నారు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నారు. తాను ఎన్నో ఏళ్ళుగా సినిమా లపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని అంటూ ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here