Home Cinema వేశ్య పాత్రలో హీరోయిన్

వేశ్య పాత్రలో హీరోయిన్

sada

అవును. తెలుగులో కూడా  ఈ సాహసాలు చేసిన వారు ఉన్నారు. సాక్ష్యాత్తూ టాలీవుడ్ స్వీటి అనుష్క ‘వేదం’ సినిమాలో వేశ్య పాత్ర చేసి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లో అయితే ఇది ఎప్పటి నుంచో ఉందనుకోండి. అయితే తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన ‘సదా’ ఇప్పుడు ఈ సాహసం చేస్తోంది. ఇప్పటికే ఒక్క అనుష్కే, శ్రియ, చార్మిలు కూడా  ఈ పాత్రలు చేశారు.  అలాంటిది పలువురు హీరోయిన్లు నిరాకరించిన వేశ్య పాత్రకు సదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు అందరిలో ఈ మసాలా పాత్రలో సదా ఎలా ఉంటుందా? అన్నదే. ప్రస్తుతం టీవీ షోలకే పరిమితం అయినా సదా…ఈ పాత్రతోఅయినా మరోసారి వెండి తెర అవకాశాలను పరీక్షించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ అవకాశం  కోలీవుడ్‌లో వచ్చింది.

                                 టార్చ్‌ లైట్‌ అనే చిత్రంలో వేశ్య పాత్ర పోషించనుందని సమాచారం. అబ్దుల్‌ మజీద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఈ టార్చ్‌ లైట్‌.దీని గురించి  దర్శకుడు తెలుపుతూ  ఏ అమ్మాయి అయినా కోరి పడుపు వృత్తికి దిగదన్నారు. పరిస్థితుల ప్రభావం, మోసాలకు గురయ్యో ఆ వృత్తిలోకి నెట్టబడతారన్నారు. అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహనను కలిగించే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం టార్చ్‌ లైట్‌ అని చెప్పారు. ఈ కథను చాలామంది నటీమణులకు చెప్పగా నటించడానికి నిరాకరించారని, తమ ఇమేజ్‌ దెబ్బతింటుందని భయపడ్డారని చెప్పారు. చివరికి నటి సదాను వెతుక్కుంటూ వెళ్లి కథ చెప్పగా ఇలాంటి కథా చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని, తాను తప్పకుండా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here