Home Latest News కెసీఆర్ పై విమర్శలు..కండక్టర్ పై విచారణ

కెసీఆర్ పై విమర్శలు..కండక్టర్ పై విచారణ

Rtc conductor

 తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్ టిసీ)కి చెందిన కండక్టర్ ఒకరు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కెసీఆర్..ఆర్టీసీ అధికారులపై విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విచారణ జరిపి..నివేదిక ఇవ్వాల్సిందిగా  ఆర్టీసీ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది. డి. సంజీవ్ అనే కండక్టర్ ఫేస్ బుక్, వాట్సప్  లో ముఖ్యమంత్రి కెసీఆర్, ఆర్టీసీ అధికారులపై విమర్శలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంజీవ్ నిజమాబాద్‌ డిపో 1లో విధులు నిర్వర్తిస్తున్నారు.  ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విజిలెన్స్‌ అధికారులకు కూడా ఆర్టీసీ  కోరింది.

                          విచారణ చేసి ఆ వివరాలు తమకు ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో ఈ తరహా ఘటన జరగటం ఇదే తొలిసారి కావటం విశేషం. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కెసీఆర్ కొంత మంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం రాతలు రాస్తున్నారని..అలాంటి వారిని వదిలే ప్రసక్తేలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. చూడాలి ఈ ఆర్టీసీ కండక్టర్ వ్యవహారం  ఏ మలుపు తిరుగుతుందో. కండక్టర్ పై విచారణకు ఆదేశించినట్లు వచ్చిన ఈ లేఖ వాట్సప్..ఫేస్ బుక్ లో వైరల్ గా మారుతోంది. అయితే ఇది ఎంత వరకూ నిజమో తెలియాల్సి ఉంది. 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here