Home Telangana కెసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత ఉద్యోగాలు కోరుతుంటే బర్రెలు..గొర్రెలు..పందులు ఇస్తామని సీఎం చెబుతున్నారని..పందులు నీ దగ్గర చేరిన వంద మంది సన్నాసులు ఉంటారు వారికివ్వు అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు మాత్రం యువతకు ఇవ్వాలని కోరారు. మెదడు వాపు వ్యాధి వచ్చిన సమయంలో అప్పటి ప్రభుత్వం పందుల పెంపకాన్ని నిషేధించిందని..కానీ కెసీఆర్ మళ్ళీ ఇప్పుడు పందుల పెంపకం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉస్మానియా విద్యార్ధి సంఘ నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘ నీ పార్టీలో గెలిచిన..ఇతర పార్టీల నుంచి నీ పంచన చేరిన సన్నాసులు ఓ వంద మంది ఉంటారు. ఈ సన్నాసులకు..నీ తాబేదార్లకు పందులు ఇవ్వు..వాటిని పెంచుకోవటానికి వారు బాగా పనికొస్తారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మార్చి 6న జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా విద్యార్ధి నేతలు రేవంత్ రెడ్డిని కోరారు.

                           ఉమ్మడి రాష్ట్రంలోనే పోలీసులు ఉస్మానియా గేటు వద్దే పరిమితం అయితే..తెలంగాణ వచ్చినంక హాస్టళ్ల దగ్గర క్యాంపులు పెట్టే పరిస్థితి వచ్చిందని రేవంత్ విమర్శించారు. తెలంగాణ తొలి శాసనసభా సమావేశాల్లో రాష్ట్రంలో లక్షా ఏడు వేల ఖాళీలు ఉన్నాయని కెసీఆర్ ప్రకటించారన్నారు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు అయినా ఇప్పటివరకూ ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. సీమాంధ్రులను వెళ్ళగొడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి..ఇప్పుడు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత చేసే పోరాటానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని..వారిపై అక్రమ కేసులు బనాయిస్తే తిరగబడతారని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here