Home Telangana ప్రముఖ తెలుగు ఛానల్ కొనుగోలుపై రిపబ్లిక్ టీవీ కన్ను!

ప్రముఖ తెలుగు ఛానల్ కొనుగోలుపై రిపబ్లిక్ టీవీ కన్ను!

electronic-media

రిపబ్లిక్ టీవీ. సంచలనాలు అంతే.. విమర్శలూ అంతే.. టైమ్స్ నౌలో ఎంతో పాపులర్ అయిన అర్నాబ్ గోస్వామి నెలకొల్పిన ఛానల్ ఇది. అయితే అర్నాబ్ ఈ ఛానల్ లో ప్రధాన వాటాదారుగా కూడా ఉన్నారు. అంతే కాదు రిపబ్లిక్ టీవీలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ కూడా పెట్టుబడిదారే. ఆయనకు చెందిన మీడియా సంస్థ ఇందులో వాటాలు కలిగిఉంది. చంద్రశేఖర్ కు చెందిన సంస్థ ఏషియా నెట్ న్యూస్ ఆన్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఎన్ వోపీఎల్) ద్వారా ఓ తెలుగు ఛానల్ ను కొనుగోలు చేసే ప్రయత్నాలు జోరందుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించిన డీల్ కుదిరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

                              దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు ఈ టీవీ అమ్మకానికి రెడీగా ఉందని..ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. రిపబ్లిక్ టీవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి అనుకులంగా ఉందనే విమర్శలను ఎదుర్కొంటోంది. దక్షిణాదిన ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బిజెపికి రాజకీయంగా పనికొచ్చేందుకు వీలుగా తెలుగులో ప్రముఖ ఛానల్ గా ఉన్న ఈ టీవీని కొనుగోలు చేయటం ద్వారా కొంత మేర అయినా ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here