Home Cinema వెల్ కం టు మై వరల్డ్ అంటున్న రవితేజ

వెల్ కం టు మై వరల్డ్ అంటున్న రవితేజ

Raviteja

రవితేజ తన అభిమానులకు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నాడా?. మరి ఆయన కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్ ‘ పోస్టర్ లో ఇదే చెబుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా..ఇందులో ఈ మాస్ మహారాజ పక్కన మెహరీన్ కౌర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

                         పనిలో పనిగా మరో ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. టచ్ చేసి చూడు సినిమాలో ఓ సంచలన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఆయన అంథుడిగా యాక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇస్తున్న రవితేజ ఎలాంటి ఫలితాన్ని రాబడతారో. రాజా ది గ్రేట్ తో పాటు రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here