Home Latest News రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారీ

రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ జారీ

Rashtrapati Bhawan

భారత రాజకీయాల్లో కీలక మార్పులకు రాష్ట్రపతి ఎన్నిక వేదిక కానుంది. రాష్ట్రపతి ఎన్నికకు ముందు…తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక పరిణామాలు ఈ ఎన్నిక తర్వాత ఉంటాయని అంచనా. ఈ తరుణంలో బుధవారం నాడే భారత రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు అవసరమైన విధివిధానాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

                              ఢిల్లీలో సీఈసీ నజీం జైదీ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని 324వ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి నిలబడే రాష్ట్రపతి అభ్యర్థిని కనీసం 50 మంది ప్రజాపతినిధుల ప్రతిపాదించాల్సి ఉంటుందని, మరో 50 మంది బలపర్చవలసి ఉంటుందని సీఈసీ తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు జూన్‌ 28లోగా నామినేషన్లు దాఖలు చేయాలన్నారు.  జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here