Home Andhra Pradesh టీవీ9 గుట్టువిప్పిన దగ్గుబాటి రానా

టీవీ9 గుట్టువిప్పిన దగ్గుబాటి రానా

rana

ఇంత కాలం మనం సినిమాల్లో మాత్రమే నటన ఉంటుంది అనుకుంటున్నాం.  కానీ ఇప్పుడు నటన వార్తా ఛానళ్లలోకి కూడా వచ్చింది. అసలు విషయం ఏమిటంటే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా ఉన్న టీవీ9 తన ఇంటర్వ్యూలు..వార్తల్లో కూడా నటనను జొప్పిస్తుందా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు సీన్ ఏమిటంటే..తమ ఛానల్ లో ఇంటర్యూకు వచ్చిన వారికి యాంకర్ పై ఎలా కేకలు వేయాలో..ఎలా బెదిరించాలో వారే చెప్పేస్తారు. ఇంటర్వ్యూకు వచ్చిన వ్యక్తి ఆ పని చేసేస్తారు. ఇదంతా ఎందుకు అంటారా?. అసలు టెక్నిక్ అక్కడే ఉంది. ఈ బిట్ ను ప్రమోకు వాడుకుని విపరీతంగా ప్రచారం కొట్టేస్తారు. అరే..పాపం..రానా ఆ యాంకర్ ను అంత దారుణంగా ఎందుకు తిట్టాడో చూశారా? అనుకోవాలి అందరూ. అంతే కాదు..అసలు ఏమి జరిగిందో చూద్దాం అనీ ప్రజలు ఆ ఇంటర్వ్యూ చూడాలి. యూట్యూబ్ లో అయితే భారీ హిట్స్ వస్తాయి. ఛానల్ లో అయితే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. రెండు రకాల లాభం. అందుకే ఇలా చేస్తారన్న మాట. ‘నేనే రాజు..నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా రానా టీవీ9కి ఇంటర్యూ ఇచ్చారు. అక్కడే జరిగింది ఈ ట్విస్ట్.

                    నటులు అన్నాక పూలు పడుతుంటాయి…అప్పుడప్పుడు రాళ్ళు పడుతుంటాయి..అంటూ డ్రగ్స్ కేసులో రకరకాల ప్రచారం జరిగింది. మీ పేరు కూడా ఉందని అన్నారు. దీనిపై ఏమంటారు అనగానే…రానా ఊగిపోయి కేకలు వేస్తాడు. దానికి యాంకర్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. చూసిన వారంతా ఇది నిజమే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అంతా ఓ నటన. రేటింగ్ లు..క్లిక్స్ కోసం ఆడిన నాటకం. ఈ నాటకాన్ని రానానే ట్విట్టర్ లో స్పష్టంగా చెప్పాడు. విష్ణు అనే యువకుడు  రానాను ఓ ప్రశ్న అడిగాడు ట్విట్టర్ లో. సార్ మీరు నిజంగా టీవీ9 యాంకర్ పై కోప్పడ్డారా? లేక ఇది పబ్లిసిటీ స్టంటా? అని. దానికి రానా కూడా చాలా నిజాయతీగా సమాధానం ఇచ్చాడు. అలా చెప్పమని ఆమె అడిగింది. ప్రమో కట్ చేసుకుంటామన్నది అంటూ…మూడు కన్నీటి చుక్కలతో కూడిన ఏమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు. దీంతో అసలు విషయం బహిర్గతం అయింది.

                          ఏ ఛానల్ లో  లేని విధంగా గతంలోనూ టీవీ 9 ఇంటర్యూల్లోనే పూలకుండీలు పగలగొట్టడం..ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగేవి. అంటే అవన్నీ కూడా ముందే ప్లాన్ చేశారనే ప్రచారం జర్నలిస్టు సర్కిల్స్ లో ఎప్పటి నుంచో ఉంది. మొత్తానికి రానా టీవీ9 ఇంటర్యూల గుట్టువిప్పాడు. దీంతో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా నిజంగా జరిగినా కూడా ‘అనుమానించాల్సిన’ పరిస్థితి కల్పిస్తున్నారన్న మాట. అసలే మీడియా వైపు ప్రజలంతా అనుమానంగా చూస్తున్న తరుణంలో ఇలాంటి డ్రామాలతో మరింత పరువుపోవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇంకో దారుణం ఏంటంటే  ఇదే ఛానల్ కు చెందిన ఓ రిపోర్టర్ తాజాగా చంద్రబాబు దగ్గర సమావేశంలోనూ జర్నలిస్టులకు ఇచ్చే ఫ్లాట్లకు ‘దేవాన్ష్ నగర్’ అని పేరు పెట్టాలని సూచించాడట. అది విన్న చంద్రబాబుకు కూడా ఒకింత సీరియస్ గా ఆ రిపోర్టర్ వేపు చూశాడు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here