Home Andhra Pradesh టీడీపీలో ‘వర్మ కలకలం’

టీడీపీలో ‘వర్మ కలకలం’

Rgv, babu

తెలుగుదేశం పార్టీలో రామ్ గోపాల్ వర్మ వ్యవహారం  కలకలం రేపుతున్నట్లు కన్పిస్తోంది. పైకి ఎన్ని మాటలు చెబుతున్నా..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై ఆ పార్టీ నేతల్లో గుబులు కన్పిస్తోంది. ఈ సినిమా నిర్మాతలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి చెందిన వారు కావటంతో టీడీపీ మరింత సీరియస్ గా స్పందిస్తోంది. అయితే అక్కడ ఉన్నది రామ్ గోపాల్ వర్మ కావటంతో ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా..మాట కు మాట అన్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా సమాధానాలు ఇస్తూ పోతుండటంతో ఈ వ్యవహారం పీక్ కు వెళుతోంది. రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా మంత్రి సోమిరెడ్డి విమర్శలపై వ్యంగాస్త్రాలు సంధించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వీటిపైనా వర్మ రియాక్ట్ అయ్యారు. అనిత కామెంట్లు..వర్మ రియాక్షన్ మీరే చూడండి.

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

వర్మ. అనితగారు ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందునుంచి విని విని విసుగెత్తిపోయాను.

టీడీపీ ఎమ్మెల్యే అనిత: 

రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..

వర్మ. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

టీడీపీ ఎమ్మెల్యే అనిత

చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే…బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు..జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..

వర్మ. అనితగారు మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు 

టీడీపీ ఎమ్మెల్యే అనిత

మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి… అదే సమజాహితo

వర్మ. ఆహా క్లాప్సు విజిల్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here