Home Cinema అక్కినేని సమంతగా తొలిసారి…!

అక్కినేని సమంతగా తొలిసారి…!

RajuGariGadhi2

సమంత. అక్కినేని సమంతగా తొలిసారి…మీడియా ముందుకు వచ్చింది. అది ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనటానికి. అదీ తన మామ అక్కినేని నాగార్జునతో కలసి. ఈ కార్యక్రమం అంతా సందడి సందడిగా సాగగా…అందరి ప్రత్యేక దృష్టి సమంతపైనే ఉంది. గురువారం రాజుగారి గది 2 చిత్రానికి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్‌లో అన్నపూర్ణ స్టూడియో తరుపున నిర్మాణ రంగంలోకి అడుగుపెడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ‘అక్కినేని వారింట్లో లింగబేధం ఉండదు. అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చూస్తారు. అమల, సుప్రియ చాలా స్ట్రాంగ్‌ ఇండిపెండెంట్‌.. అదే నాకు పెద్ద బ్లెస్సింగ్స్‌.

                                నా నుంచి ఆ కుటుంబం ఏం ఆశించడం లేదు, నన్ను ఏమి అడగడం లేదు. కానీ, నేనిప్పుడు అక్కినేని సమంతని. నాపై నేనే పెద్ద బాధ్యత పెట్టుకున్నాను’ అంటూ అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టడం ఎంత సంతోషంగా ఉందో తెలిపారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటానని, కానీ, నా క్యారెక్టర్‌ ఎందుకు ఉంటుందో ఇప్పటికీ తానే చెప్పలేనని అన్నారు. ఒక సినిమా హిట్‌ అయినా ప్లాప్‌ అయినా వన్‌ వీక్‌లో మర్చిపోతారని, అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here