Home Andhra Pradesh టీడీపీలో పురందేశ్వరి లేఖ దుమారం

టీడీపీలో పురందేశ్వరి లేఖ దుమారం

purendeswari

తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అవసరం లేకపోయినా సమస్యలు కొనితెచ్చుకోవటం అంటే ఇదేనని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో తీసుకున్న వ్యవహారంపై దగ్గుబాటి పురందేశ్వరి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలకు లేఖ రాశారు. ఇలా చేయటం వల్ల బిజెపి కూడా ఇబ్బందేనని వ్యాఖ్యానించారు.

                          బిజెపి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠినచట్టం తేవాలని పురందేశ్వరి తన లేఖలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here