Home Andhra Pradesh కొత్త రూట్లలో గంటకు రూ.2500కే విమాన ప్రయాణం

కొత్త రూట్లలో గంటకు రూ.2500కే విమాన ప్రయాణం

pm-modi-udan

అందరికీ అందుబాటులోకి విమానయానం. గంటకు 2500 రూపాయల టిక్కెట్ తోనే విమాన ప్రయాణం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ‘ఉడాన్’ స్కీమ్ ఉద్దేశం ఇది. ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకం కొత్త ఫ్లైట్లను గురువారం నాడు జెండా ఊపి ప్రారంభించారు. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా  మొట్టమొదటి ‘ఉడాన్’ ప్రాంతీయ విమానాలను   హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ప్రధాని  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ప్రసంగించిన  ప్రధాని ఇక విమాన  ప్రయాణాలు కేవలం ధనికులకు మాత్రమే కాదు, పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయని  వ్యాఖ్యానించారు.  

                            దేశీయ  విమానయారంగం భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఛండీగడ్‌ విమానాశ్రయంలో  హర్యానా ముఖ‍్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌,  పంజాబ్ గవర్నర్‌  వి.పి. బడ్నోర్ హర్యానా గవర్నర్‌ కెప్టెన్‌ సింగ్ సోలంకి, ఇతర ముఖ్య అధికారులు మోదీకి స్వాగతం పలికారు. సిమ్లా-ఢిల్లీ మార్గంతో సహా,  కడప-హైదరాబాద్‌, నాందేడ్‌-హైదరాబాద్‌ మార్గాల్లోనూ ఉడాన్‌ విమాన సర్వీసులను  మోదీ ప్రారంభించారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ లెక్కన కొత్తగా ప్రారంభం కానున్న కడప  రూట్ లో 2500 రూపాయలతోనే ప్రయాణించవచ్చన్న మాట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here