Home Cinema పెళ్లి చూపులు మూవీ రివ్యూ

పెళ్లి చూపులు మూవీ రివ్యూ

సినిమా: పెళ్లిచూపులు
నటీనటులు: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని

ఆ సినిమా పోస్టర్ చూడగానే ఫ్రెష్ లుక్. ఈ సినిమా యాడ్స్ చూసినా అదే భావన. ఏదో తెలియని కొత్తదనం. చాలా మంది ఫ్రెష్ లుక్ తో కన్పిస్తారు. కానీ అలాంటి వాటికి ఇది భిన్నం అని చెప్పకతప్పదు. కథలో దమ్ము ఉండాలే కానీ..కొత్తవాళ్లు అయినా ఆదరిస్తానటానికి టాలీవుడ్ లో ఎన్నో ఉదాహరణలు. అలాంటి ఓ కొత్త ప్రయోగమే పెళ్లిచూపులు. మరి ప్రయోగం సఫలం అయిందా..విఫలమా? తెలుసుకోవాలంటే  ఓ లుక్కేయండి. ఈ చిత్రం కథ ఏమిటంటే  జీవితాన్ని ఎటువైపు తిప్పాలి అనే అంశంపై ఏ మాత్రం స్పష్టత లేని  ఈ తరం యువకుడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). ఓ మంచి చెఫ్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆ ప్రయత్నాల్లో నిమగ్నమవుతాడు. ప్రశాంత్ కు భవిష్యత్తు మీద ఆలోచన లేదన్న భావనతో పెళ్లి చేస్తే కుదురుకుంటాడని చిత్ర( రీతూ వర్మ) అనే అమ్మాయితో పెళ్లి నిర్ణయిస్తారు. చిత్రకు కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఎలాగైనా ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది ఆమె కల. చిత్ర పెళ్లికి నో చెప్పటంతో ప్రశాంత్‑కు వేరే అమ్మాయిని చూస్తారు.

ఆ సంబంధం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవ్వటంతో ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రశాంత్, చిత్రతో కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలు పెడతాడు. ఏ మాత్రం పొంతన లేని వేరు వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది..? చివరకు ప్రశాంత్, చిత్రలు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే సినిమా కథ. ఎవడే సుబ్రమణ్యంతో సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశాడు. అతని నటన కూడా చాలా సహజంగా ఉంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.  ఇండిపెండెంట్ గా వ్యవహరించే అమ్మాయిగా రీతూ నటన బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్ ను చాలా  బాగా పలికించింది. తొలి సినిమాతోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రచయితగా, దర్శకుడిగా రెండు విభాగాలలో సక్సెస్ అయ్యాడు. తొలి భాగాన్ని ఎంతో పక్కాగా నడిపించిన తరుణ్ ద్వితీయార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబం తో కలసి సరదాగా చూడదగ్గ చిత్రం.

రేటింగ్. 3.25\5

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here